ఎండ తగలడం లేదా ? విటమిన్-డి తగ్గిందో ఇక అంతే.. ఈ ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం!

ఎండ తగలడం లేదా ? విటమిన్-డి తగ్గిందో ఇక అంతే.. ఈ ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం!

రోజంతా నాలుగు గోడల మధ్యే గడిపేస్తున్నారా? ఆఫీస్ పని, ఇంట్లోని పనులతో ఎండ ముఖం చూడటమే అరుదైపోయిందా? అయితే మీ శరీరం ఒక ముఖ్యమైన విటమిన్‌ను మిస్ అవుతున్నట్లే! అదే.. ‘విటమిన్-డి’. దీనినే ప్రేమగా ‘సన్‌షైన్ విటమిన్’ అని కూడా పిలుస్తారు. విటమిన్ డి తక్కువైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.

శరీరం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి విటమిన్-డి ఎంతగానో అవసరం. చాలామంది దీనిని కేవలం ఎముకల ఆరోగ్యానికి మాత్రమే అనుకుంటారు. కానీ, మన మూడ్ నుండి ఇమ్యూనిటీ వరకు ప్రతీ దానిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. శరీరంలో విటమిన్-డి తగ్గితే మనకు తెలియకుండానే  ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

విటమిన్-డి లోపిస్తే ఎదురయ్యే సమస్యలు ఇవే:

*బాడీలో క్యాల్షియంను అబ్జార్బ్ చేసేందుకు విటమిన్ -డి ఉపయోగపడుతుంది. రోజూ డైరీ ప్రాడెక్ట్స్ తిన్నప్పటికీ విటమిన్-డి లోపం ఉంటే అవి ప్రభావం చూపదు. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి. బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే డెయిరీ ప్రొడక్ట్స్ తో పాటు విటమిన్ డి కూడా ఉండేలా చూసుకోవాలి.

*సన్ షైన్ విటమిన్ మన మూడ్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అందుకే విటమిన్ డి లోపం ఉంటే డిప్రషన్ పెరుగుతుందని స్టడీస్ చెప్తున్నాయి. ఎండలో బయటికి వెళ్లడం వల్ల మన మూడ్ కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు.

►ALSO READ | మీరు ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా..డాక్టర్లు చెబుతున్న తప్పనిసరి జాగ్రత్తలు

*విటమిన్-డి డైరెక్ట్ గా మన ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుంది. బాడీలోని ఇన్ఫెక్షన్స్, ఇల్ నెస్ పై  పోరాడుతుంది. విటమిన్-డి లోపం ఉంటే జలుబు, దగ్గు ఎక్కువగా వస్తుందని, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని జర్మనీలోని జీనా యూనివర్సిటీ ఆఫ్ హాస్పిటల్స్ చేసిన సర్వేలో తేలింది.

*రోజూ పడుకున్నా, రెస్ట్ తీసుకున్నా అలసటగా అనిపిస్తే అది విటమిన్-డి తక్కువగా ఉందని సంకేతం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే రోజు పనులు చేసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.

*విటమిన్ -డి పుష్కలంగా ఉంటే జుట్టు పెరుగుతుంది. పొల్యూషన్, స్ట్రెస్ లాంటి వాటితో పాటు విటమిన్-డి లోపం ఉంటే కూడా హెయిర్ లాస్ అవుతుంది.