మహారాష్ట్రలో ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్రముఖ బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్లకు అక్కడి సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో నడుస్తున్న అన్ని బైక్ ట్యాక్సీలను పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు జూలై 2027 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ ఫ్లీట్‌కు మారాల్సిందేనంటూ సర్కార్ కఠినమైన డెడ్‌లైన్ విధించింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం పెట్రోల్ ఆధారిత బైక్ ట్యాక్సీలను నడుపుతున్న ఆపరేటర్లకు మొదటి దశలో 6 నెలల గడువు లభించనుంది. మహారాష్ట్ర బైక్ ట్యాక్సీ రూల్స్, 2025 కింద ప్రొవిజనల్ లేదా తాత్కాలిక లైసెన్సులు పొందిన వారికి ఈ నిబంధనలను పాటించడానికి అదనంగా మరో 3 నెలల సమయం లభిస్తుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇలా మొత్తంగా కేవలం 9 నెలల ఫేజ్డ్ ట్రాన్సిషన్ పీరియడ్‌ను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది.
అయితే ప్రభుత్వ నిర్ణయంపై డ్రైవర్లు, అగ్రిగేటర్ల నుంచి తీవ్ర వ్యతిరేక్త వ్యక్తమవుతోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చే బైక్ ట్యాక్సీ రైడర్లు ఒకేసారి ఈవీలను కొనుగోలు చేయడం ఆర్థికంగా భారమని అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరిపడా ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఎలక్ట్రిక్ వాహనాల లైఫ్ తక్కువగా ఉండటం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ మహారాష్ట్ర బైక్ ట్యాక్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమిత్ గావ్డే తమకు కనీసం ఏడాదిన్నర సమయం కావాలని ప్రభుత్వాన్ని కోరారు.
►ALSO READ | UPI ఛార్జీల ఎఫెక్ట్: గ్రామాల్లోకి దొంగ నోట్లు మార్చే గ్యాంగ్స్.. చిరు వ్యాపారులకు అలర్ట్
అగ్రిగేటర్లు అయితే మహారాష్ట్ర ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ఉదహరిస్తూ 2030 వరకు గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. మొదట 50:50 నిష్పత్తిలో పెట్రోల్, ఎలక్ట్రిక్ టూవీలర్లను అనుమతించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. కేబినెట్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈవీల ధరలు ఎక్కువగా ఉన్నందున కంపెనీలు కొనుగోళ్లకు వెనకడుగు వేసే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
అధికారిక అనుమతులు లేని, నిబంధనలు పాటించని బైక్ ట్యాక్సీ ఆపరేషన్లపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిఘా పెంచింది. రైడ్ క్యాన్సిలేషన్లపై భారీ జరిమానాలు విధిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఫ్లీట్ మొత్తాన్ని ఎలక్ట్రిక్ బాట పట్టించాలని నిర్ణయించడం రవాణా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో అగ్రిగేటర్లు 9 నెలల స్వల్ప వ్యవధిలో ఈ భారీ మార్పును ఎలా అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
