ఇండియా, విండీస్‌‌‌‌ జట్లకు ఐసీసీ భారీ జరిమానా

ఇండియా, విండీస్‌‌‌‌ జట్లకు ఐసీసీ భారీ జరిమానా

న్యూఢిల్లీ: ఇండియా, వెస్టిండీస్‌‌‌‌ మధ్య జరిగిన మూడో వన్డేలో స్లో ఓవర్‌‌‌‌ రేట్‌‌‌‌ నమోదు చేసినందుకు ఇరుజట్లకు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో ఇండియా నాలుగు ఓవర్లు, విండీస్‌‌‌‌ రెండు ఓవర్లు తక్కువగా వేసిందని మ్యాచ్‌‌‌‌ రిఫరీ ప్రకాశ్‌‌‌‌ భట్‌‌‌‌ తేల్చారు. దాంతో టీమిండియా మ్యాచ్‌‌‌‌ ఫీజులో 20, విండీస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఫీజులో 10 శాతం కోత విధించారు.

ఇరుజట్ల కెప్టెన్లు తప్పిదాన్ని అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేదని ఐసీసీ వెల్లడించింది. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌‌‌‌లో షై హోప్‌‌‌‌ (162) భారీ సెంచరీతో విండీస్‌‌‌‌ను గెలిపించాడు. దాంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో ఇండియా ఆధిక్యాన్ని 2–1కి తగ్గించాడు.