ములకలపల్లి: పాండవుల గుట్టను సందర్శించిన ఎమ్మెల్యేలు

ములకలపల్లి: పాండవుల గుట్టను సందర్శించిన ఎమ్మెల్యేలు

ములకలపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం నల్లముడి గ్రామ శివారులోని పురాతన పాండవుల గుట్టను ఆదివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఛత్తీస్‌‌‌‌గఢ్  రాష్ట్రం దంతెవాడ ఎమ్మెల్యే సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సందర్శించింది. పాండవుల గుట్ట పరిసరాల్లోని చారిత్రక ప్రదేశాలు, పురాతన కట్టడాలు, ఆలయాలను పరిశీలించారు. 

ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి పురాతన ఆలయాలు, కట్టడాలను పరిరక్షించడంతో పాటు వాటి విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. పాండవుల గుట్టకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రపోజల్స్​ రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్  నాయకులు బత్తుల అంజి, ఎండీ జహీరుద్దీన్, కారం సుధీర్, గాడి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.