‘గ్రాడ్యుయేట్’ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం

‘గ్రాడ్యుయేట్’ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం
  • బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర 

ఖమ్మం, వెలుగు : త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ల విజయం ఖాయమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు.  ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

అసెంబ్లీ ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా, గతంలో కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, చంద్రావతి, పార్టీ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి 
పాల్గొన్నారు.