ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి : వరంగల్ సీపీ ఎన్.శ్వేత

ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి : వరంగల్ సీపీ ఎన్.శ్వేత

వరంగల్​సిటీ, వెలుగు: వరంగల్ ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీపీ ఎన్. శ్వేత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు– పరిష్కారం, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌‌‌‌మెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ పీడీ భరద్వాజ్‌‌‌‌, రోడ్లు, భవనాలు, మున్సిపల్, ట్రాఫిక్ విభాగాల అధికారులు, పోలీసులు హాజరయ్యారు. 

సిటీలో తరచూగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పవర్‌‌‌‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ట్రాఫిక్ సిగ్నళ్ల పనితీరు కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సిన జంక్షన్లపై సూచనలు చేశారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, హన్మకొండ ఏసీపీ నర్సింగరావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణతో పాటు ట్రాఫిక్ విభాగం అధికారులు, ట్రైసిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఇన్‌‌‌‌స్పెక్టర్లు, ఐటికోర్, టి టి ఐ ఇన్స్ స్పెక్టర్లు , మున్సిపల్, ఆర్ అండ్ బి పాల్గొన్నారు.