హైదరాబాద్, వెలుగు: దుబాయ్ చాంబర్స్ సంస్థ బెంగళూరులో పర్యటించి నాస్‌కామ్, ఎఫ్‌కేసీసీఐతో రెండు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది. ఏఐ సహకారం, డీప్‌టెక్ రంగాల్లో వృద్ధిని సాధించడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలపరచడం ఈ ఒప్పందాల ముఖ్య ఉద్దేశం.
దుబాయ్ చాంబర్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ రషీద్ లూతా నేతృత్వంలోని ప్రతినిధి బృందం పలు కంపెనీలతో భేటీ అయింది. నాస్‌కామ్‌తో కుదిరిన ఒప్పందం వల్ల భారతీయ టెక్నాలజీ కంపెనీలకు దుబాయ్‌లో వ్యాపార విస్తరణకు మార్గం సుగమం అవుతుంది.
ఎఫ్‌కేసీసీఐతో చేసుకున్న ఒప్పందం ఫలితంగా వర్చువల్ దుబాయ్ డెస్క్ ఏర్పాటు అవుతుంది. ఈ ఏడాది జూన్ వరకు 7,579 కొత్త భారతీయ కంపెనీలు దుబాయ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో చేరాయని అలీ ప్రకటించారు.
