ములుగు మెడికల్‌‌‌‌ కాలేజీ, హాస్పిటల్‌‌‌‌లో 47 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ములుగు మెడికల్‌‌‌‌ కాలేజీ, హాస్పిటల్‌‌‌‌లో 47 పోస్టుల భర్తీకి  దరఖాస్తుల ఆహ్వానం

ములుగు, వెలుగు: ములుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, అనుబంధ హాస్పిటల్‌‌‌‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్​ జి.స్వర్ణ కుమారి గురువారం తెలిపారు. ప్రొఫెసర్- 5, అసోసియేట్ ప్రొఫెసర్-17, అసిస్టెంట్ ప్రొఫెసర్-25 చొప్పున మొత్తం 47పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 

ఎంపికైన అభ్యర్థులను 2027 మార్చి 31 వరకు లేదా అవసరం మేరకు ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 24 న ఉదయం 11 గంటల నుంచి సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 2గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు సెప్టెంబర్ 10న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.