ఢిల్లీలో H1N1 వైరస్ కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఢిల్లీ , ఎన్ సీఆర్ పరిధిలోని ఆస్పత్రులన్నీ H1N1 వైరస్ బాధితులతో నిండిపోయాయి. ఢిల్లీ ప్రభుత్వాస్పత్రి, డాక్టర్లతో సహా సిబ్బందికి H1N1 పాజిటివ్ సోకింది. ఈ వైరస్ సోకిన వారికి ఆక్సిజన్ స్థాయి పడిపోవడం, శ్వాస కోశ సమస్యలు తలెత్తుతున్నాయి. తేమతో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ వైరస్ వేగంగా విస్తరిస్తు్ందని డాక్టర్లు చెబుతున్నారు.
H1N1 లక్షణాలు.. ఆకస్మికంగా జ్వరం, పొడిదగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి , గొంతునొప్పి, చలి, అలసట వంటి లక్షణాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని సందర్బాల్లో రోగలలో శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తుతాయని, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం, ఆయాసం, ఛాతినొప్ప, తగ్గని అధిక జ్వరం, ఇరిటేషన్, పెదవులు నీలి రంగులోకి మారడం వంటి లక్షణాలు ఎక్కువయితే వెంటనే చికిత్స తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. H1N1 వైరస్ ఎక్కువగా చిన్న పిల్లలు, వృద్దులు, దీర్ఘకాలికి వ్యాధులు ఉన్నవారు, గర్భిణీలపై ప్రభావం చూపుతుందని, జాగ్రత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.
H1N1 వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు పరిశుభ్రత పాటించాలని కోరుతున్నారు. ఇన్ఫ్లుయెంజా టీకా, పరిశుభ్రత, లక్షణాలు కనిపిస్తే ఇంట్లోనే ఉండటం వంటి నివారణ చర్యల ద్వారా ఈ వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టొచ్చంటున్నారు డాక్టర్లు.
