పెరుగుతున్న అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యాచారం చేసే వారికి శిక్షలు మరింత కఠినంగా ఉండాలని .. రేప్ చేయాలంటేనే భయపడి పోవాలని ఢిల్లీ పోలీసులు కీలక ఆదేశాల జారీ చేసింది. ఢిల్లీ ఎన్ సీఆర్ అత్యాచారం కేసు విచారణ సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేసింది. నేరం పాల్పడే వారి మనసులో చట్టం పట్ల భయాన్ని కలిగించడం అవసరమని కోర్టు తెలిపింది. నేరం చేస్తే ఏం జరుగుతుందో , వాటి పరిణామాలకుభయపడకపోతే, అటువంటి నేరాలను నివారించడం కష్టమని అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది.
సమాజంలోని ప్రతి మహిళ మన తల్లి, సోదరి వంటిది. మనం వారికి భద్రతా భావాన్ని కల్పించాలి. మనం ఇంట్లో మహిళల భద్రతను ఎలాగైతే నిర్ధారిస్తామో, సమాజంలో కూడా అలాగే చేయాలి. ఒక మహిళ బస్సులో ఒంటరిగా ప్రయాణిస్తుంటే, పోలీసులకు ఆమె గురించి సమాచారం ఉండాలని, ఆమె భద్రతపై చురుకుగా వ్యవహరించాలని కోర్టు పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణ నవంబర్ 16కు వాయిదా వేసింది.
నేరాలపై నిఘాకోసం వార్ రూం..
నేరాల నియంత్రణకు ఓ వార్ రూం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఢిల్లీపోలీసులను ఆదేశించింది. నేరాలను అరికట్టడంలో ఢిల్లీ పోలీసులు ఏవైనా ప్రత్యేక చర్యలు చేపట్టారా.. వార్ రూం లాంటిది ఏర్పాటు ఏదైనా ఏర్పాటు చేశారా అని పోలీసులను ప్రశ్నించింది. జాతీయ డేటా బేస్ ద్వారా అనుమానిత క్రిమినల్స్, ప్రమేయం ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టాలని అధికారులను కోర్టు కోరింది. మహిళలు, విద్యార్థులనుపదే పదే వేధించే వ్యక్తులు ఉన్నారని, అన్ని ఏజెన్సీలు కలిసి నిఘా ఉంచితే పరిస్థితిని చక్కదిద్ద వచ్చని తెలిపింది. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు 2012 నిర్భయ కేసును కూడా ప్రస్తావించింది. అనుమతి లేకుండా నడుస్తున్న హోటళ్లలో మద్యం కూడా అందిస్తున్న ప్రదేశాలపై దృష్టి సారించాలని కోర్టు ఢిల్లీ పోలీసులను కోరింది. 2012 నాటి ఘటనకు సంబంధించిన రికార్డుల ప్రకారం, నిందితురాలు నేరం చేయడానికి ముందు ఓ ప్రదేశంలో భోజనం , మద్యం సేవించినట్లు కోర్టు పేర్కొంది.
ఢిల్లీలోని భద్రతా ఏర్పాట్లపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. బహిరంగ ప్రదేశాలు, పార్కులలో తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని సొలిసిటర్ జనరల్ ను కోరింది. క్షేత్రస్థాయిలో పోలీస్ నిఘా, జవాబుదారితనం, నియంత్రణ చర్యల అవసరాన్ని ధర్మాసనం నొక్కిచెప్పింది.
