ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ కార్యాలయాన్ని సందర్శించిన ..తెలంగాణ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ బృందం

ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ కార్యాలయాన్ని సందర్శించిన ..తెలంగాణ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ బృందం
  • గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఆ దేశ వలస విధానం పరిశీలన 

హైదరాబాద్, వెలుగు: గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ కార్మికులకు మెరుగైన అండదండలు అందించే లక్ష్యంతో తెలంగాణ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ అడ్వైజరీ కమిటీ బృందం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపింది. విదేశాల్లో ఉండే తమ పౌరులు, వలస కార్మికుల రక్షణ కోసం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను ఆ దేశ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ బృందానికి వివరించారు.

ఈ చర్చల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొని గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి నివాసముంటున్న సుమారు 15 లక్షల మంది కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపారు. ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విజయవంతంగా అమలువుతున్న వలస కార్మికుల విధానాన్ని లోతుగా అధ్యయనం చేసి, తెలంగాణలోనూ అలాంటి ఉత్తమ విధానాలను అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ ఫస్ట్ సెక్రటరీ నీలేష్ కుమార్ రాయ్ పాల్గొన్నారు.