కుశలమా అంటూ అడిగే.. ఆకట్టుకుంటున్న ఎపిక్ సాంగ్

కుశలమా అంటూ అడిగే.. ఆకట్టుకుంటున్న ఎపిక్ సాంగ్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘90స్‌‌’ వెబ్‌‌ సిరీస్‌‌ ఫేమ్ ఆదిత్య హసన్‌‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎపిక్‌‌ – ఫస్ట్ సెమిస్టర్‌‌‌‌’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.  మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్..  ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా, గురువారం థర్డ్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు.  

హేషమ్ అబ్దుల్ వహాబ్  కంపోజ్ చేయగా,  కె.ఎస్.చిత్ర,  ఎస్.పి.చరణ్ పాడిన విధానం ఆకట్టుకుంది. ‘కుశలమా అంటూ అడిగే అతడి కౌగిలింత.. కుశలమే అంటూ పలికే ఆమెలోని చింత.. మనసులో మాట అర్ధమయ్యేంత చనువు ఉన్నదంటా.. మనసా వాచా..’ అంటూ   శ్రీహర్ష ఈమని లిరిక్స్ రాయగా, పాటలో   హీరో హీరోయిన్ మధ్య   ప్రేమ, అనుబంధంను చూపించిన విధానం ఆసక్తిని పెంచింది. సెప్టెంబర్ 11న సినిమా విడుదల కానుంది.