టాలీవుడ్‌లో క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రేక్షకులను మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా కొత్త కాన్సెప్ట్స్‌తో దర్శకులు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం 'మిస్సింగ్ మేఘన'. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్‌ను కల్ట్ ప్రొడ్యూసర్ SKN లాంచ్ చేశారు. టీజర్ చూసిన అనంతరం కథాంశం చాలా ఇన్నోవేటివ్‌గా ఉందని, కొత్త కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఆయన ప్రశంసించారు. చిన్న సినిమాలకు ప్రమోషన్స్ చేసేందుకు ఎస్కేఎన్ ముందుంటారని దర్శకుడు వాచస్పతి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రొమోలు, సాంగ్స్ కు మంచి స్పందన వస్తుందన్నారు. అలాగే అందరూ ముందుకు వచ్చిన చిన్న చిత్రాలకు ప్రమోషన్స్ చేయాలని కోరారు.
ఈ మూవీలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ విడుదల కాగా, లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు విడుదల చేసిన ‘పిల్లా.. పిల్లా.. పిల్లా’ ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంది.
ALSO READ : అమెజాన్ ప్రైమ్ బిగ్ మిస్టేక్.. థియేట్రికల్ రిలీజ్ ముందే ఓటీటీలోకి వచ్చేసిన 'మ్యూటినీ'!
శామ్.కె. నాయుడు సినిమాటోగ్రఫీ, ఆర్.ఆర్. ధృవన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కథలోని మిస్టరీ, మిస్సింగ్ కేసు చుట్టూ తిరిగే ఉత్కంఠభరిత అంశాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా సినిమా రూపొందించామని నిర్మాత నరేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. టీజర్‌తోనే క్యూరియాసిటీ పెంచిన 'మిస్సింగ్ మేఘన'.. థియేటర్లలో ఎలాంటి థ్రిల్ అందించబోతోందో చూడాలి మరి..
