హైదరాబాద్ ORR మీద బైక్పై వెళ్లడం ఏంటయ్యా.. చివరకు ఏమైందంటే..

హైదరాబాద్ ORR మీద బైక్పై వెళ్లడం ఏంటయ్యా.. చివరకు ఏమైందంటే..

హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై బైక్ డ్రైవ్ చేసిన వ్యక్తికి పోలీసులు జరిమానా విధించారు. బైక్స్, స్కూటర్లు, ఆటోలకు ORRపై అనుమతి లేదు. అయినప్పటికీ బైక్ డ్రైవ్ చేస్తూ జోరుగా, హుషారుగా సదరు వ్యక్తి వెళ్లడం వీడియోలో రికార్డ్ అయింది. ORR ఎక్స్ ప్రెస్ వేపై రాజేంద్ర నగర్ నుంచి TSPA జంక్షన్ మీదుగా బైక్ వెళ్లడాన్ని పోలీసులు గమనించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు అతనిని తీసుకెళ్లి జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 500 రూపాయలు, నో ఎంట్రీ అని తెలిసినా కూడా వెళ్లినందుకు 100 రూపాయలు, డేంజరస్ డ్రైవింగ్ కింద వెయ్యి రూపాయలు.. మొత్తం 1635 రూపాయల ఛలాన్ విధించారు.

ORRపైకి అనధికారికంగా ప్రవేశించడం ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే.. 100 కిలోమీటర్లకు పైగానే వేగంతో భారీ వాహనాలు ఓఆర్ఆర్పై వెళుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో బైక్ డ్రైవింగ్ చేయడం, పైగా అనుమతి లేదని తెలిసినా ORRపైకి బైక్, స్కూటీ తీసుకుని వెళ్లడం డేంజర్ను వెతుక్కుంటూ వెళ్లినట్టే.

ALSO READ : కారు ప్రమాదంలో ఇనార్బిట్ మాల్లో పనిచేసే యువతి స్పాట్ డెడ్.. 

ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై బైక్‌లు, స్కూటర్లు, ఆటోలకు అనుమతి లేదని మరోసారి ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు గుర్తు చేశారు. భద్రత, ఇతరుల భద్రత దృష్ట్యా నిర్దేశించిన ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సురక్షితంగా వాహనం నడపాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చారు.