అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి సినిమా అమీర్ లోగ్. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా విడుదల చేయనుంది.
ఈ చిత్రంలో ఇప్పటివరకు ఎవరూ చూడని ఒక కొత్తదనం ఉంటుందని, కచ్చితంగా ఇది ‘హిట్టు బొమ్మ’ అవుతుందని దర్శకుడు రమణా రెడ్డి సోమ ధీమా వ్యక్తం చేశారు. మలయాళ చిత్రాల తరహాలో మన దగ్గర ప్రయోగాలు రాలేదనే లోటును ఈ సినిమా తీరుస్తుందని, హైదరాబాద్ ఎరా ఇక్కడితో స్టార్ట్ అవుతుందని అన్నారు. ప్రీమియర్లకు వస్తున్న అద్భుతమైన స్పందనే తమ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. తన భర్త పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, సినిమా చూసి బయటికి వచ్చే ప్రతి ప్రేక్షకుడూ ఒక మంచి ఎమోషన్‌ను ఇంటికి తీసుకెళ్తాడని నిర్మాత మాధవి రెడ్డి అన్నారు.
Grand Release Tomorrow #AmeerLog BOOKINGS ARE OPEN NOW!
— Awwal Number Productions (@Awwal_Films) August 20, 2026
Grab your tickets on @bookmyshow & @district_india apps and get ready for a full-on Hyderabadi entertainer!
Book My Show:https://t.co/zxwuHl9h6a…
District App: https://t.co/eJ67thGfnJ… pic.twitter.com/yCyStRuM6v
తమ కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి గొప్ప చిత్రంలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని నటులు ఎంసీ హరి, మనోజ్ తెలిపారు. తెలంగాణ సంస్కృతిని, నిజాయితీని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని, స్మరణ్ సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిందని వారు కొనియాడారు. ప్రీమియర్లు వేసిన ప్రతి చోటా థియేటర్లు దద్దరిల్లాయని.. ఆగస్ట్ 21న కూడా అదే స్థాయి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు నటి వేద జలంధర్ ఇతర నటీనటులు అభిప్రాయపడ్డారు.
ALSO READ : ‘టాక్సిక్’ ఇంగ్లీష్ ట్రైలర్‌కు పిచ్చ క్రేజ్..
ఇప్పటికే విడుదలైన ప్రీమియర్ షోలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం మూవీపై అంచనాలు పెంచేస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అమెరికా నుంచి కూడా ఈ సినిమా గురించి ఆరా తీస్తున్నారని సహ నిర్మాత మనోహర్ రెడ్డి తెలిపారు. వైవిధ్యమైన కథాంశంతో, బలమైన భావోద్వేగాలతో తెరకెక్కిన ‘అమీర్ లోగ్’ ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. కచ్చితంగా ఈ సినిమా టాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందని మూవీ యూనిట్ బలమైన నమ్మకంతో ఉంది. ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం మరో రోజు వేచి చూడాల్సిందే మరి.
