అడ్వాన్స్డ్ స్కిల్స్ కోసమే శక్తి డిపార్ట్మెంట్‎లో పాలిటెక్నిక్‌ విలీనం.. విద్యార్థులు ప్రతిపక్షాల మాట నమ్మొద్దు: మంత్రి వివేక్

అడ్వాన్స్డ్ స్కిల్స్ కోసమే శక్తి డిపార్ట్మెంట్‎లో పాలిటెక్నిక్‌ విలీనం.. విద్యార్థులు ప్రతిపక్షాల మాట నమ్మొద్దు: మంత్రి వివేక్

హైదరాబాద్: పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి స్కీమ్‎లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేస్తోన్న ఆందోళనలపై మంత్రి వివేక్ స్పందించారు. గురువారం (ఆగస్ట్ 20) సెక్రటేరియట్‎లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే పాలిటెక్నిక్‎లను శక్తి డిపార్ట్మెంట్‎లోకి మారుస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. పాలిటెక్నిక్‎లను అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని.. విద్యార్థులకు అడ్వాన్స్డ్ స్కిల్స్ నేర్పించడం కోసమే శక్తి డిపార్ట్ మెంట్ తీసుకొచ్చామని తెలిపారు. 

పాలిటెక్నిక్ లెక్చరర్ల సర్వీస్ రూల్స్ మారవని.. ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులను కొంత మంది రాజకీయ నేతలు మిస్ గైడ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు TG ECET ఎగ్జామ్ పాసయితై ఇంజనీరింగ్ కాలేజీలో నేరుగా సెకండియర్‎లో జాయిన్ కావచ్చని క్లారిటీ ఇచ్చారు. ఫీజుల్లో ఎలాంటి కూడా మార్పు లేదని.. విద్యార్థులు ఎవరూ భయపడొద్దని చెప్పారు. ప్రస్తుతం ఉన్న విధివిధానాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ భూములు అమ్ముతున్నారనేది అవాస్తవమన్నారు. ప్రతిపక్షాల మాటలు విద్యార్థులు నమ్మొద్దని కోరారు. 

పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన:

పాలిటెక్నిక్ కాలేజీల విభాగాన్ని శక్తి విభాగంలో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నం.97 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో 97 ద్వారా పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను శక్తి స్కీమ్‌ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మారనున్నాయి. శక్తి స్కీమ్‌ లో విలీనాన్ని పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తమ మూడేళ్ల డిప్లొమా విలువను, భవిష్యత్తును దెబ్బతీస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాలిటెక్నిక్ అనంతరం బీటెక్ సెకండియర్‎లో చేరే అవకాశం కోల్పోతామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.