సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న సీఎం.. టూర్ క్యాన్సిల్ కావడంతో ఆగస్టు 23న తిరిగి హైదరాబాద్ రానున్నారు.
అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరిచడంతో టూర్ క్యాన్సిల్ చేసుకున్న సీఎం.. అధికారులను పంపాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ కారణాలతోనే తన పర్యటనకు అనుమతి నిరాకరించారని అన్నారు. రైజింగ్ తెలంగాణ ఆగదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికా పర్యటన షెడ్యూల్ చేశామని రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించారని ఆరోపించారు.
ఆగస్టు 20 నుంచి 30 తేదీ వరకు పది రోజులు సీఎం యూకే, యూఎస్ పర్యటన ఉంది. తెలంగాణను అంతర్జాతీయ విద్య, స్కిల్ డెవలప్మెంట్ హబ్ గా తీర్చిదిద్దడం, ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి వర్సిటీల ఆఫ్ షూర్ క్యాంపస్ లకు ఏర్పాటు, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం పర్యటన ఖరారయింది.
ఆగస్టు 20న అర్థరాత్రి 12.30 కి లండన్ వెళ్లిన సీఎం.. 21న ఆక్స్ ఫర్డ్స్ యూనివర్సిటీలో బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ సందర్శనతో పాటు ఎమిరేట్స్ స్టేడియంలో ఈపీఎల్ ఫుట్ బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
22న కేంబ్రిడ్జ్ బృందంతో కీలక భేటీ జరపనున్నారు. అదేరోజు యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్, లండన్ బిజినెస్ స్కూల్ సందర్శిస్తారు. ఆ తర్వాత 23న బ్రిటన్ నుంచి బోస్టన్ చేరుకోవాల్సి ఉంది. కేంద్రం అనుమతి నిరాకరిండంతో పర్యటన రద్దు చేసుకుని 23న హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.
