జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ ను వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి తరలించారు. గురువారం(ఆగస్టు20) అర్థరాత్రి ఇమ్రాన్ ఖాన్ ను అడియాలా జైలునుంచి ఇస్లామాబాద్ లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించారు. సుమారు ఐదు గంటల వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 5గంటలకు తిరిగి అడియాలా జైలుకు తరలించారు. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యల విజ్ణప్తి మేరకు ఆయనకు మెరుగైన వైద్యసేవలు అందించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) వర్గాలు తెలిపాయి.
గత మూడేళ్లుగా ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభిస్తున్నారు. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, పర్సనల్ డాక్టర్లు చేసిన విజ్ణప్తి మేరకు పాకిస్తాన్ సుప్రీంకోర్టు.. పర్సనల్ డాక్టర్ ఫైసల్ సుల్తాన్ నేతృత్వంలోని వైద్య బృందం అతడిని పరీక్షించాలని కోర్టు ఆదేశించింది.
