- అండర్‌పాస్‌లు, స్టీల్‌బ్రిడ్జిల
- రద్దుతో రూ.1200 కోట్లు ఆదా
- జీహెచ్ఎంసీ కమిషనర్ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు : కేబీఆర్‌పార్కు చుట్టూ ఏర్పాటు చేసిన వన్ వే విధానంతో ట్రాఫిక్సమస్య చాలా వరకు పరిష్కారమైందని, అందుకే ఇంతకుముందు నిర్మించాలనుకున్న స్టీల్బిడ్జి, అండర్‌పాస్‌లను రద్దు చేశామని కమిషనర్ఆర్వీ కర్ణన్చెప్పారు. అయితే, ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ వరకు భారీగా ట్రాఫిక్ రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్‌తో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి సంతోష్, ఇంజినీరింగ్ అధికారులు హరీశ్, విజయ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రతిపాదిత కారిడార్ ప్రాంతాన్ని పరిశీలించారు.
రెండు ప్యాకేజీలుగా...
జూబ్లీహిల్స్ చెక్పోస్ట్నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వరకు 4.3 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నామని, దీనికి అంచనా వ్యయం రూ.1,090 కోట్లు అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్నట్టు ప్రకటించారు.
మొదటి ప్యాకేజీలో చెక్పోస్ట్జంక్షన్ నుంచి ముగ్ధా జంక్షన్ వరకు స్టీల్ ఫ్లైఓవర్ ఉంటుందని, దీనికి రూ.580 కోట్లు కేటాయించామన్నారు. రెండో ప్యాకేజీలో ముగ్ధా జంక్షన్ నుంచి ముఫఖం జా కాలేజీ వరకు ఫ్లైఓవర్‌తో పాటు బంజారాహిల్స్ రోడ్ నంబర్-1కు అనుసంధానం కోసం ర్యాంప్ నిర్మించనున్నారు. ఈ ప్యాకేజీకి రూ.510 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. కొత్త అలైన్‌మెంట్ వల్ల భూసేకరణ, నిర్మాణ వ్యయాల్లో రూ.1,200 కోట్ల వరకు ఆదా కానున్నదన్నారు.
