ప్రివిలేజ్‌‌ ట్యాక్స్‌‌ ను రద్దు చేయాలి : రాష్ట్ర బార్‌‌ అండ్‌‌ రెస్టారెంట్స్ అసోసియేషన్‌‌ అధ్యక్షుడు దామోదర్‌‌  

ప్రివిలేజ్‌‌ ట్యాక్స్‌‌ ను రద్దు చేయాలి : రాష్ట్ర బార్‌‌ అండ్‌‌ రెస్టారెంట్స్ అసోసియేషన్‌‌ అధ్యక్షుడు దామోదర్‌‌  
  • బార్​ యజమానులతో కలిసి అబ్కారీ భవన్​ ముట్టడి

అబిడ్స్, వెలుగు : బార్లు, రెస్టారెంట్లపై కొత్తగా విధిస్తున్న ప్రివిలేజ్‌‌ ట్యాక్స్​ రద్దు చేయాలని  రాష్ట్ర బార్‌‌ అండ్‌‌ రెస్టారెంట్స్​అసోసియేషన్‌‌ అధ్యక్షుడు దామోదర్‌‌ గౌడ్‌‌ డిమాండ్‌‌ చేశారు. సోమవారం బార్​యజమానులతో కలిసి హైదరాబాద్​ నాంపల్లిలోని గృహకల్ప నుంచి ర్యాలీగా వెళ్లి, అబ్కారీ భవన్‌‌ ను ముట్టడించారు. పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకున్నారు.  దామోదర్‌‌ గౌడ్‌‌ మాట్లాడుతూ.. లైసెన్స్‌‌ ఫీజులు, పన్నులు, నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో మరో పన్ను విధించడం సరికాదన్నారు.

బార్లు ఉన్న ప్రాంతాల్లో అక్రమ పర్మిట్‌‌ రూమ్​లు, బెల్ట్‌‌ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లైసెన్స్‌‌ రెన్యూవల్‌‌ ఐదేళ్లకోసారి చేసే విధానం తీసుకురావాలన్నారు. కమిషనర్‌‌ అందుబాటులో లేకపోవడంతో రవీంద్రభారతిలోని ఎక్సైజ్‌‌ శాఖ మంత్రి క్యాంప్​ఆఫీస్​కు వెళ్లి, మంత్రి అడిషనల్‌‌ పర్సనల్‌‌ సెక్రటరీ వెంకటేశ్వర్‌‌రావుకు వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ , గౌరవ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణ , శ్రీనివాస్ గుప్త, సంజీవరావు, నరసింహ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.