జననేతకు ఘన నివాళి..రాజధానిలో వైభవంగా కాకా జయంతి  

జననేతకు ఘన నివాళి..రాజధానిలో వైభవంగా కాకా జయంతి  

ముషీరాబాద్, వెలుగు :  జనం గుండెల్లో కొలువైన మహానేత, దివంగత కాకా వెంకటస్వామి జయంతిని రాష్ట్ర రాజధానిలో అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.  మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్ ఇతర నేతల  ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కాక విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.

అలాగే, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నామ సైదులు ఆధ్వర్యంలో కాక ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘాల రాష్ట్ర నాయకులు  కేశబోయిన మురళి యాదవ్, మాల స్టూడెంట్ జేఏసీ నాయకులు, బత్తుల రమేష్, బత్తుల దిలీప్, పెరమళ్ళ వేణు, రజక సంఘం నాయకులు రఘు, రామకృష్ణ, నరేష్ పాల్గొన్నారు.

అంబేద్కర్ ​కళాశాలల్లో...

కాక వెంకటస్వామి జయంతి సందర్భంగా బాగ్ లింగంపల్లి లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల ఆవరణలో ఉన్న కాక విగ్రహానికి ఎమ్మెల్యే వినోద్ కుమార్, విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజ వివేక్, జాయింట్ సెక్రటరీ రమణ, సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, ఎంపీ వంశీ కృష్ణ సతీమణి గడ్డం రోషిణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత అంబేద్కర్ కాలేజ్ నుంచి ట్యాంక్ బండ్ కాక వెంకటస్వామి విగ్రహం వరకు ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​స్టూడెంట్స్ మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.

దీన్ని  కరస్పాండెంట్ సరోజ వివేక్ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే, కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్​లర్​ప్రొఫెసర్ వి నిత్యానందరావు తదితరులు పాల్గొన్నారు.

అలాగే, డాక్టర్ బీఆర్​అంబేద్కర్​ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌‌మెంట్ అండ్ టెక్నాలజీలో ఎంబీఏ 2026–-28 బ్యాచ్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహీంద్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డిన్ అనాది శరణ్ పాండే, ఓయూ ప్రొఫెసర్ జహంగీర్​పాల్గొని మాట్లాడారు.