నెట్వర్క్, వెలుగు : మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు గురువారం ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మోటకొండూర్‌లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, హాలియాలో ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్, వనపర్తిలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో పాటు వివిధ ప్రాంతాల్లో డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత, సంజీవ్ ముదిరాజ్ తదితర నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహాలు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సాంకేతిక, డిజిటల్, టెలికాం విప్లవాలకు నాంది పలికి, 18 ఏండ్లకే ఓటు హక్కు కల్పించడం ద్వారా యువతకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను కొనియాడారు.
