తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విద్యాసంస్థల బందుకు పిలుపు

తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విద్యాసంస్థల బందుకు పిలుపు

దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు : నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ కల్లూ రూపారెడ్డి  దారుణ హత్యకు నిరసనగా ప్రైవేట్ స్కూళ్ల బంద్​కు ప్రైవేట్ స్కూల్ యజమాన్యాల రాష్ట్రనాయకుడు యానాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. 

గురువారం ట్రాస్మా ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ హైస్కూల్​లో ఆమె ఆత్మకు అశ్రునివాళి సభ, అనంతరం పాఠశాల నుంచి చౌరస్తా వరకు  నల్ల బ్యాడ్జిలు ధరించి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మైనర్లు సెల్​ ఫోన్లు వాడకుండా నిషేధిస్తూ చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.