IRUMUDI: బేబీ నక్షత్ర నటనకు ఆడియన్స్ ఫిదా.. ‘ఇరుముడి’లో ఛాన్స్ ఎలా వచ్చిందంటే?

IRUMUDI: బేబీ నక్షత్ర నటనకు ఆడియన్స్ ఫిదా.. ‘ఇరుముడి’లో ఛాన్స్ ఎలా వచ్చిందంటే?

‘ఇరుముడి’ చిత్రంలో రవితేజ కూతురిగా బేబీ నక్షత్ర నటించిన మణికంఠ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రవితేజ–నక్షత్ర మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ఎమోషనల్ టచ్ ఇచ్చాయని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. తెలుగు సినిమాకు తొలిసారి పరిచయమైనప్పటికీ, నక్షత్ర తన నటనతో ఆకట్టుకుందని, ముఖ్యంగా డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్‌లో ఆమె కాన్ఫిడెంట్‌గా కనిపించిందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

రవితేజతో ఆమె కెమిస్ట్రీ కూడా సహజంగా అనిపించిందని పలువురు చెబుతున్నారు. ఇప్పటికే తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన నక్షత్రకు ‘ఇరుముడి’ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉందని సినీ అభిమానులు అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే “రవితేజతో బేబీ నక్షత్ర సీన్స్ బాగున్నాయి”, “చైల్డ్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది” అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా, రవితేజతో ఫ్రెండ్లీగా పనిచేసిన అనుభవం, శివ నిర్వాణ ఇచ్చిన సపోర్ట్‌తో నక్షత్ర తన పాత్రను కాన్ఫిడెంట్‌గా చేయడం సినిమాకు ప్లస్‌గా మారిందనే టాక్ వినిపిస్తోంది. మంధు మానేస్తే  చెయ్యి వణుకు వచ్చేస్తది అని రవితేజ అన్నప్పుడు.. నేన్ పట్టుకుంటాను నాన్న అని చెప్పే డైలాగ్ కట్టిపడేలా చేసిందని ఆడియన్స్ ట్వీట్స్ పెడుతున్నారు.

తెలుగు సినిమాలో తొలి అడుగే అదుర్స్..

 ‘ఇరుముడి’ చిత్రంతో తెలుగు సినిమాకు పరిచయం అవడం సంతోషంగా ఉందని చెప్పింది బేబీ నక్షత్ర. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌‌ నిర్మించిన ఈ చిత్రంలో ఆమె రవితేజకు కూతురుగా నటించింది. ఇవాళ శుక్రవారం సినిమా విడుదలైన సందర్భంగా బేబి నక్షత్ర చిత్ర విశేషాలను గురించి వివరించింది.

బేబీ నక్షత్ర మాట్లాడుతూ.. ‘మాది కేరళ. నేను ఏడో తరగతి చదువుతున్నా. ఇప్పటికే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆరు సినిమాల్లో నటించా.  శివ నిర్వాణ గారు ఇన్‌‌స్టాలో నా రీల్స్ చూసి మా అమ్మను సంప్రదించారు. రవితేజ గారి సినిమాతో టాలీవుడ్‌‌కు రావడం హ్యాపీ. నాతో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు.

ALSO READ : IRUMUDI Review: ‘ఇరుముడి’ రివ్యూ.. 

ఆయన సినిమాల్లో ‘విక్రమార్కుడు’ నా ఫేవరేట్. ఆయన కూతురిగా మణికంఠ అనే పాత్రలో కనిపిస్తా. షూటింగ్‌‌ అంతా సీలేరులో జరగడంతో నాకు ఆ ప్రదేశాలు కేరళలాగే అనిపించాయి. శివనిర్వాణ గారి సపోర్ట్‌‌ వల్ల కాన్ఫిడెంట్‌‌గా నటించగలగడంతో పాటు డబ్బింగ్ కూడా చెప్పా” అని నక్షత్ర చెప్పుకొచ్చింది.