డిగ్రీ ఉంది కానీ ఉద్యోగానికి పనికిరారు.. నిరుద్యోగంపై నీతి ఆయోగ్ నివేదిక

డిగ్రీ ఉంది కానీ ఉద్యోగానికి పనికిరారు.. నిరుద్యోగంపై నీతి ఆయోగ్ నివేదిక

ఇండియాలో ఏటా లక్షల మంది డిగ్రీ పట్టాలు పుచ్చుకుంటున్నా ఉద్యోగాలు దొరికేది  మాత్రం చాలా తక్కువ మందికి. దీంతో చదువుకు తగిన ఉద్యోగం దొరక్క కొందరు, అవసరానికి ఏదో ఒకటి అని కొందరు క్వాలిఫికేషన్ కు సరిపడని జాబ్స్ చేస్తూ గడిపేస్తున్నారు. సగానికి సగం మందికి కనీసం అలాంటి జాబ్స్ కూడా దొరకటం లేదు. అయితే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పై నీతి ఆయోగ్ సంచలన రిపోర్ట్ వెల్లడించింది. 

ఆగస్టులో పబ్లిష్ చేసిన రిపోర్టులో నిరుద్యోగానికి కారణం ఏంటో పేర్కొంది నీతి ఆయోగ్. దేశంలో పట్టాదారులను ఉద్యోగులుగా మలచడంలో సమస్య ఉందని తెలిపింది. ఇది నిరుద్యోగ సమస్య ఒక్కటే కాదని.. చదివిన చదువుకు, జాబ్ మార్కెట్ కు కావాల్సిన స్కిల్స్ కు ముడిపడిన అంశం అని పేర్కొంది. 

రీఇమాజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ ఎట్ 2047 (Reimagining Skilling for Viksit Bharat @2047) అనే టైటిల్ తో 2026 ఆగస్టు 18న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఇండియాలో కేవలం 8.25 శాతం పట్టాదారులకే వారి చదువుకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నట్లు పేర్కొంది. 

విద్యా వ్యవస్థ సంక్షోభం.. గమ్యం లేని డిగ్రీలు.. 

భారతదేశ ఉన్నత, సాంకేతిక విద్యా వ్యవస్థలో చెప్పే పాఠాలకు , జాబ్  మార్కెట్ డిమాండ్లకు మధ్య పెద్ద అంతరం ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. సిలబస్ పాతబడి పోయిందని.. మారుతున్న ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు లేవని ఈ  రిపోర్ట్ హైలైట్ చేసింఇ. ఫలితంగా, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికేట్లు ఉన్నప్పటికీ అవి ఉపాధి కల్పనగా మారడం లేదని పేర్కొంది.

అండర్ గ్రాడ్యుయేట్ (UG) ప్రోగ్రామ్‌లలో చేరిన 3.4 కోట్ల మంది విద్యార్థులలో, 1.13 కోట్ల మంది కేవలం బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA) లోనే చేరారు.  BA, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (BCom) లలో కలిపి చేరిన వారి సంఖ్య రెండు కోట్లకు పైగా ఉంది.

ఈ ప్రోగ్రామ్‌లకు  వీక్ జాబ్ లింకేజెస్ (బలహీనమైన ఉద్యోగ సంబంధాలు) ఉన్నాయని చెప్పింది. ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని  కారణంతో చాలా మంది ఏదో చదువుతున్నాం అంటే చదువుతున్నాం అన్నట్లుగా డిగ్రీ చేస్తున్నారని పేర్కొంది. కానీ మార్కెట్ కు కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవడంలో వెనకబడి పోతున్నారని తెలిపింది.  

  చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలకు సిద్ధంగా లేరు..

  కేవలం ఉపాధి గణాంకాలలోనే కాకుండా, ఏయే విషయాలలో వెనుకబడి ఉన్నామని విద్యార్థులు స్వయంగా చెబుతున్నారో అనే విషయాన్ని కూడా అందులో కూడా నీతి ఆయోగ్ హైలైట్ చేసింది.  

డిగ్రీలు చేస్తున్నప్పటికీ 34 శాతం  మంది విద్యార్థులు స్కిల్స్ లేకపోవడం ఆందోళన కరంగా నీతి ఆయోగ్ పేర్కొంది.  18 శాతం మంది ఇంటర్వ్యూలకు సిద్ధంగా లేమని చెప్పినట్లు రిపోర్టు వెల్లడించింది.  ఉద్యోగులలో డిజిటల్, కమ్యూనికేషన్ నైపుణ్యాలలో కూడా అంతరాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. 

 ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 80శాతం మంది విద్యార్థులు తమ డిగ్రీలలో ప్రాక్టికల్ నాలెడ్జీ రావటం లేదని.. పారిశ్రామిక అవసరాలేంటో తమకు ఎలా తెలుస్తాయని చెబుతున్నారు. పాఠ్య ప్రణాళికల ద్వారా ఇంప్లిమెంట్ చేస్తేనే కదా తమకు తెలిసేది అనేది విద్యార్థుల వాదనగా పేర్కొంది.