జ్యోతిష్యం: సింహరాశిలో బుదాధిత్య రాజయోగం.. 12 రాశుల్లో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..!

జ్యోతిష్యం: సింహరాశిలో బుదాధిత్య రాజయోగం.. 12 రాశుల్లో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల యువరాజు  బుధుడు త్వరలో  తన స్థానాన్ని మార్చుకోబుతున్నాడు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న బుధుడు ఆగస్టు 22 వ తేది సాయంత్రం 7:58 గంటలకు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు.  అప్పటికే అక్కడున్న కేతువు.. సూర్యుడితో బుధుడు కలవడం వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది.  ఇది సెప్టెంబర్ 17వ తేదీ వరకుకొనసాగుతుంది. ఈ శుభ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుంది.  బుధాదిత్య రాజయోగం వలన   ఏరాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ  స్టోరీలో తెలుసుకుందాం. . .

మేష రాశి:  బుధుడు సింహరాశిలో  సంచారం  వలన ఈ రాశి వారికి  ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమ స్యల నుంచి విముక్తి లభిస్తుంది. గతంలో ఆగిపోయిన పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. అదనపు ఆదాయానికి మార్గాలు లభిస్తాయి. మనసు చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. న్యాయ పరమైన కేసుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతి లేదా వేతన పెరుగు దలకు అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

వృషభరాశి : సింహరాశిలో బుధాదిత్య యోగం వలన  ఈ రాశి వారికి  ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.  ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు.    వ్యాపారస్తులు  కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది.  తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు..  ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.  ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని...  ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పండితులు సూచిస్తున్నారు. .

మిథునరాశి : సింహరాశిలో బుధాదిత్య యోగం వలన ఈ రాశి వారికి శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి.  పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయానికి కొత్త మార్గాలు లభించొచ్చు. ఉద్యోగులకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఇల్లు  మరియు భూమికి సంబంధించిన విషయాలలో పురోగతి ఉంటుంది.  ఈ రాశివారికి  ఇలాంటి వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. తల్లిదండ్రుల నుండి ఆనందాన్ని పొందుతారు.

కర్కాటకరాశి : బుధుడు.. .. సింహరాశిలోకి ప్రవేశించడంతో  ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది.  పెళ్లి ప్రయత్నాలు చేసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో మీరే చక్రం తిప్పుతారు.  ప్రమోషన్ తో వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.   ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. గతంలో నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి.  ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

సింహ రాశి :   సింహరాశిలో బుధాదిత్య రాజయోగం  వలన  ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారంలో లాభిస్తుంది. వ్యాపారంలో బాగా రాణిస్తారు.చాలా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ శక్తితో సమాజంలో చాలా కీర్తిని పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం.  విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి.  ఉద్యోగంలో ఊహించని మార్పులు కలిగే అవకాశం ఉంది.   ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.  ఆఫీసర్ల మద్దతు పుష్కలంగా ఉంటుంది. 

కన్య రాశి :  సింహరాశిలో బుధుడు సంచారం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. తొందరపాటు నిర్ణయాలతో ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది.  కీలక ఒప్పందాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.  అవకాశం ఉంటే వాయిదా వేసుకోవడం చాలా మంచిది. 
ఉద్యోగస్తులకు  కొన్ని ప్రతికూల పరిస్థితుల వలన ఆందోళన కలిగే అవకాశం ఉంది.   మీ పని మీరు చేసుకోండి.  ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు.  ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  చేపట్టిన పనులు ఆలస్యం కావడం.. రావలసిన డబ్బులు చేతికి అందకపోవడం.. ఖర్చులు పెరగడం  వలన ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి.  కావున ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

తులా రాశి : బుధుడు.. సింహరాశిలో ఉన్న ఈ కాలంలో ఈ రాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపారాల్లో ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది. వృత్తిపరమైన విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కష్టపడి చేసిన పనులు సఫలీకృతమవుతాయి. ఈ కాలంలో వీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగులకు కూడా ఇది మంచి సమయమని పండితులు చెబుతున్నారు.కెరీర్​ లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతులవుతారని పండితులు చెబుతున్నారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.

వృశ్చికరాశి : సింహరాశిలో..  బుధ సంచారం ఈ రాశి వారికి వారి వృత్తిలో లాభిస్తుంది. పనిలో మంచి సమయం ఉంటుంది. సంతోషంగా మరియు సంతృప్తిగా అనుభూతి చెందుతారు. జీవితంలో సౌఖ్యం, విలాసం పెరుగుతాయి. ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగపరంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు  మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అనేక విధాలుగా రాబడిపెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడడం మొదలవుతుంది. మంచి పరిచయాలుఏర్పడతాయనా పండితులు చెబుతున్నారు.

ధనుస్సురాశి :  బుధాదిత్య రాజయోగం వలన  ఈ రాశి వారికి  ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారు చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోతాయి.  దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. శుభకార్యాలు ఇంట్లోనే నిర్వహించుకోవచ్చు. భూమి, వాహనం కొనుగోలుకు అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. 

మకరరాశి : సింహరాశిలో బుధాదిత్య రాజయోగం వలన ఈ రాశి వారికి చాలా శుభప్రదమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఆర్థిక స్థితి బాగుంటుంది.  అప్పులు తీరడంతో పాటు.. రావాల్సిన డబ్బులు తిరిగి వచ్చేస్తాయి. జీవితంలో చాలా పెద్ద మార్పులు కనిపిస్తాయి.    కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు  రెట్టింపవుతాయి. సీనియర్ల సహాయం అందుతుంది. విద్యార్థులకు కూడా మంచి సమయం. ఈ కాలంలో కెరీర్‌లో విజయాలు, ప్రమోషన్‌లు అందుకుంటారు. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు.

కుంభ రాశి :  బుధుడు స్థానచలనం వలన .. ఈ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది.  కెరీర్​ విషయంలో  కొత్త అవకాశాలను అందుకునే అవకాశం ఉంది.  ప్రమోషన్​వచ్చే అవకాశం ఉంది.   కష్టపడి పనిచేయడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సంతోషాల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో పెట్టిన పెట్టుబడులకు అధికంగా లాభాలు కలుగుతాయి.  సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. అంతా మంచే జరుగుతుంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మీనరాశి:  బుధుడు .. రాశి మార్పు వలన  ఈ రాశి వారికి చిన్నపాటి సమస్యలు రావచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితం కూడా పొందలేరు. . వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  అయినా ఏ మాత్రం నిరుత్సాహం చెందకండి.  ఆలస్యంగా మీరు తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండండి.   అనవసరమైన వాటిని ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయంలో   బదిలీ జరిగే  అవకాశం ఉంది.   ఇది గందరగోళాన్ని పెంచుతుంది. వ్యాపారంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవద్దు.  డబ్బును ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.