ఖానాపూర్: స్త్రీనిధి నిధుల గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణ

ఖానాపూర్: స్త్రీనిధి నిధుల గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణ

ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామంలో  స్త్రీనిధి నిధుల్లో రూ.16.67,166 పక్కదారి పట్టినట్లు అధికారులు నిర్వహించిన సోషల్ ఆడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బయటపడింది. దీంతో కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాల మేరకు సోమవారం గ్రామంలో స్త్రీనిధి ఆర్ఎం సరిత విచారణ చేశారు. 2021 నుంచి 2025 వరకు రుణాలు పొందిన గ్రూపు సభ్యులు రూ.65,93,685 తిరిగి చెల్లించగా అందులో నుంచి వీఏవో రూ.12,47,520 తక్కువగా బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిపాజిట్ చేసినట్లు తేలింది. 

అలాగే గ్రూపు సభ్యులకు తెలియకుండా రూ 4,19,646 అప్పుగా చూపినట్లు బయట పడింది. విచారణ అధికారుల ముందు వీఏవో ఆ డబ్బును ఏఎంకు రూ.10 లక్షలు, సీసీకి రూ.3 లక్షలు ఇచ్చానని చెప్పింది. కాగా స్త్రీ నిధి నిధులు గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్​పై  మహిళలు ఆందోళనకు దిగారు.  డబ్బు రికవరీ చేయాలని డిమాండ్​ చేశారు.