పెండింగ్ అర్జీలన్నీ పరిష్కరించాలి

పెండింగ్ అర్జీలన్నీ పరిష్కరించాలి

హనుమకొండ కలెక్టరేట్/ కాశీబుగ్గ/ భూపాలపల్లి రూరల్/ జనగామ అర్బన్/ ములుగు/ వెంకటాపూర్/ ​ఖమ్మం టౌన్, వెలుగు: పెండింగ్​ అర్జీలన్నీ త్వరగా పరిష్కరించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణిలో వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. హనుమకొండ ప్రజావాణికి 263 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. 

వరంగల్​ గ్రీవెన్స్​కు 211 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్​ సత్యశారద చెప్పారు. జయశంకర్​ భూపాలపల్లి ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్​ రాహుల్​శర్మ ప్రజల నుంచి 112 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. జనగామలో 396 వినతులు వచ్చాయని కలెక్టర్ సందీప్​కుమార్​ ఝా తెలుపగా, ​ములుగులో మొత్తం 96 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్​ కలెక్టర్​ సీహెచ్​మహేందర్​జీ చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో కలెక్టర్​ దివాకర ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.