ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ఇందిరమ్మ ఇండ్లతో  నిరుపేదల జీవితాల్లో వెలుగులు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, వెలుగు: ఇందిరమ్మ ఇంటి పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిందని, సీఎం రేవంత్​రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేస్తున్నామని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం గంగాధర మండలం మధురానగర్​ ప్రజా కార్యాలయంలో బూరుగుపల్లికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, మరో 2 వేల ఇండ్లను మంజూరు చేయించి ఇండ్లు లేని నిరుపేదలకు కేటాయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజిత, ఎంపీడీవో రాము, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్, సర్పంచులు కళ్యాణ్, ఆనందం, అజయ్ రావు, వీరేశం, తిరుపతి, భాస్కర్ పాల్గొన్నారు.