ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా బైక్‌లకు అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లను అమర్చినా, అనధికారికంగా పోలీస్ సైరన్ వినియోగించినా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్మహాజన్హెచ్చరించారు. నెల రోజులుగా ఆదిలాబాద్ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి స్వాధీనం చేసుకున్న 121 భారీ శబ్ధం వచ్చే సైలెన్సర్లను సోమవారం ఎస్పీ సమక్షంలో కలెక్టర్‌చౌక్‌లో రోడ్డు రోలర్‌తో తొక్కించారు.
ఇక నుంచి జిల్లావ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు బి.సునీల్ కుమార్, ప్రణయ్ కుమార్, ఎస్ఐలు దేవేందర్, ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు.
