రైస్‌‌‌‌ కుక్కర్‌‌‌‌ పేలి చిన్నారులకు గాయాలు.. కొల్లాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ఘటన

రైస్‌‌‌‌ కుక్కర్‌‌‌‌ పేలి చిన్నారులకు గాయాలు.. కొల్లాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ఘటన

కొల్లాపూర్‌‌‌‌, వెలుగు: అంగన్‌‌‌‌వాడీ కేంద్రంలో రైస్‌‌‌‌ కుక్కర్‌‌‌‌ పేలి పలువురు చిన్నారులు గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా కొల్లాపూర్‌‌‌‌ పట్టణంలోని 10వ వార్డులో ఉన్న 18వ అంగన్‌‌‌‌వాడీ కేంద్రంలో ఆయా రైస్‌‌‌‌ కుక్కర్‌‌‌‌లో అన్నం వండి చిన్నారుల ముందే ఉంచింది. ఇదే సమయంలో ఓ చిన్నారిని బాత్రూంకు తీసుకెళ్లగా, లోపల ఉన్న పిల్లలు కుక్కర్‌‌‌‌ను కదిలించారు. దీంతో ఒక్కసారిగా కుక్కర్‌‌‌‌ పేలి వేడి అన్నం చిన్నారులపై పడటంతో వారు గాయపడ్డారు.

వెంటనే చిన్నారులను కొల్లాపూర్‌‌‌‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌, చిల్డ్రెన్​ డాక్టర్​ యాదగిరి బిల్లా చికిత్స అందించారు. సీడీపీవో మహేశ్వరి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. చిన్నారులు ఉన్న చోటే రైస్‌‌‌‌ కుక్కర్‌‌‌‌ను ఉంచి తెరవడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన ఆయాపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.