లింగాల మండలంలో నాలుగేళ్ల చిన్నారితో కలిసి మహిళ అదృశ్యం

లింగాల మండలంలో నాలుగేళ్ల చిన్నారితో కలిసి మహిళ అదృశ్యం

లింగాల, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండలం రాంపూర్  గ్రామానికి చెందిన ఓ మహిళ తన నాలుగేళ్ల కూతురితో కలిసి అదృశ్యమైంది. ఎస్సై చంద్రకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్  గ్రామానికి చెందిన డ్యారంగుల అంజికి, బంగారమ్మ అలియాస్  అంజలి(28)తో వివాహం జరిగింది. ప్రస్తుతం అంజి ప్రైవేట్ ట్రావెల్స్‌‌‌‌‌‌‌‌లో డ్రైవర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నాడు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. 

ఈ నెల3న తెల్లవారుజామున అంజి డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య అంజలి, నాలుగేళ్ల కూతురు కీర్తి ఇంట్లో కనిపించలేదు. బంధువులు, పరిచయస్తుల వద్ద గాలించినా ఆచూకీ లభించకపోవడంతో అంజి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.