రూ.వెయ్యి కోట్ల మార్కెట్పై రస్నా కన్ను

రూ.వెయ్యి కోట్ల మార్కెట్పై రస్నా కన్ను

 హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్‌‌స్టంట్ బెవరేజెస్ తయారీ సంస్థ రస్నా తన రెడీ టు డ్రింక్ (ఆర్​టీడీ) ఫ్రూట్ బెవరేజ్ పోర్ట్‌‌ఫోలియోను విస్తరించింది. ఇందులో భాగంగా జంపిన్  లీటర్ ఫ్యామిలీ సైజ్ టెట్రా ప్యాక్‌‌ను విడుదల చేసింది.  

వేగంగా విస్తరిస్తున్న ప్రీమియం రెడీ టు డ్రింక్ ఫ్రూట్ నెక్టర్ విభాగంలో సుమారు రూ.1000 కోట్ల మార్కెట్ అవకాశాన్ని లక్ష్యంగా చేసుకుని దీనిని తీసుకొచ్చామని తెలిపింది. 

దీనిలో ఎక్కువ ఫ్రూట్ కంటెంట్‌‌తో పాటు 10 విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్యాక్​ ధర రూ.110 అని రస్నా తెలిపింది.