ఏఐ+ ఉత్పత్తులపై ఫ్లిప్‌‌కార్ట్ గోట్ సేల్ ఆఫర్లు

 ఏఐ+ ఉత్పత్తులపై ఫ్లిప్‌‌కార్ట్ గోట్ సేల్ ఆఫర్లు

హైదరాబాద్​, వెలుగు: ఫ్లిప్‌‌కార్ట్ నిర్వహిస్తున్న గోట్ సేల్ సందర్భంగా ఏఐ+ స్మార్ట్‌‌ఫోన్ తన స్మార్ట్‌‌ఫోన్లు , ఏఐఓటీ ఉత్పత్తుల పోర్ట్‌‌ఫోలియోపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.  ఏఐ+ పల్స్ 2 స్మార్ట్‌‌ఫోన్ కేవలం రూ.తొమ్మిది వేలకు లభిస్తోంది. 

ఈ ఫోన్లో 6.745 అంగుళాల హెచ్‌‌డీ+ డిస్‌‌ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, యునిసోక్ టీ7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 50ఎంపీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌‌ ఉంటాయి. నోవా 2, నోవా 2 ప్రో వంటి  ఫోన్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. 

వీటితో పాటు వేరబుల్స్, ఆడియో ఉత్పత్తులు, పల్స్ ట్యాబ్‌‌లతో పాటు తొలిసారిగా నోవావాచ్ రొటేట్‌‌క్యామ్ 4జీ స్మార్ట్‌‌వాచ్ ఈ సేల్‌‌  ద్వారా అందుబాటులోకి వచ్చింది.