సెప్టెంబర్లో NSE ఐపీఓ! ఇష్యూ సైజ్ రూ.30 వేల కోట్లు

సెప్టెంబర్లో NSE ఐపీఓ! ఇష్యూ సైజ్ రూ.30 వేల కోట్లు

ముంబై:  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్‌‌ఈ) మెగా ఐపీఓ  ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో ఇన్వెస్టర్ల ముందుకొచ్చే అవకాశం ఉంది. సుమారు రూ.30 వేల కోట్లను దాదాపు  రూ.5 లక్షల కోట్ల వాల్యూయేషన్ దగ్గర సేకరించాలని సంస్థ చూస్తోంది.  

ఐపీఓ విజయవంతమైతే, 2024 అక్టోబర్‌‌లో వచ్చిన హ్యుందాయ్ మోటార్స్ (రూ.27,870 కోట్లు) రికార్డును అధిగమించి, అతిపెద్ద ఐపీఓగా నిలుస్తుంది.   ఎన్‌‌ఎస్‌‌ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్‌‌ రూట్‌‌లో జరుగుతుంది.  

కంపెనీ ఫైల్ చేసిన డ్రాఫ్ట్ పేపర్ల ప్రకారం,  ఈ ఇష్యూ ద్వారా ప్రస్తుత షేర్‌‌‌‌హోల్డర్లు 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను (దాదాపు 6శాతం వాటా) విక్రయిస్తున్నారు.  ఎస్‌‌బీఐ  గరిష్టంగా 2.48 కోట్ల షేర్లను, ఆ తర్వాత ఎంఎస్ స్ట్రాటజిక్ సంస్థ 1.60 కోట్ల షేర్లను అమ్మనున్నాయి.