బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణ ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీటీపీఓఏ), జీవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10న ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను టీటీపీఓఏ అధ్యక్షుడు డాక్టర్ జయరాం, డాక్టర్ ఎంజీ రామచంద్రన్, జీవీకే ప్రతినిధులు అజయ్‌కుమార్, ఎం.రాజు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెగా జాబ్ మేళాలో వందకు పైగా కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 93919 27259, 84666 70308, 94417 92625 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
