ప్రదీప్ రంగనాథన్‌‌ నిర్మాతగా.. మమితా బైజు లేడీ ఓరియెంటెడ్ మూవీ

ప్రదీప్ రంగనాథన్‌‌ నిర్మాతగా.. మమితా బైజు లేడీ ఓరియెంటెడ్ మూవీ

మలయాళ చిత్రం ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మమితా బైజు.. ఆ తర్వాత రెబల్‌‌,  డ్యూడ్‌‌ లాంటి అనువాద చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం సూర్యకు జంటగా ‘విశ్వనాథ్‌‌ అండ్‌‌ సన్స్‌‌’లో నటిస్తోంది. తాజాగా తనొక లేడీ ఓరియంటెడ్‌‌ సినిమాలో నటించబోతోంది. 

ది ఆల్ఫా యూనిట్‌‌ పేరుతో ఆరుగురు దర్శకులు విశాల్ టి.ఆర్, యష్ వి, నరేన్ సావోడా, చాణక్యన్ ఆర్, ధనుష్ కుమార్, ఇలంపరిధి తెరకెక్కించబోయే ఈ చిత్రాన్ని సోమవారం అనౌన్స్‌‌ చేశారు. పీఆర్ షో పేరుతో ప్రొడక్షన్‌‌ హౌజ్‌‌ స్టార్ట్‌‌ చేసిన తమిళ యువహీరో ప్రదీప్‌‌ రంగనాథన్‌‌.. తొలిచిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రదీప్‌‌,  మమితా బైజు కలిసి నటించిన ‘డ్యూడ్‌‌’ చిత్రాన్ని డైరెక్ట్‌‌ చేసిన అశ్వత్‌‌ మారిముత్తు ఇందులో నటుడిగా కీలకపాత్రను పోషిస్తున్నాడు. 

అనౌన్స్‌‌మెంట్‌‌ వీడియోలో అశ్వత్‌‌పై కత్తి విసురుతూ కనిపించింది మమిత.  శివాజీ, స్వసిక, అనామిక మహి, లిజ్జీ ఆంటోనీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. మూవీ టీమ్‌‌ను పరిచయం  చేస్తూ స్టైలిష్‌‌గా ప్రజెంట్‌‌ చేసిన వీడియోను బట్టి మమితా బైజు ఇందులో యాక్షన్‌‌ రోల్‌‌ చేస్తున్నట్టు అర్థమవుతోంది.