స్కూటీ, కారు ఢీకొని ఇద్దరు మృతి.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో ప్రమాదం

స్కూటీ, కారు ఢీకొని ఇద్దరు మృతి.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో ప్రమాదం

ఆమనగల్లు, వెలుగు: స్కూటీ, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అన్నెబోయినపల్లి గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని మార్కాపురం జిల్లా రాయవరం గ్రామానికి చెందిన వెనుకొండ బాబు, బుర్రి బాబు కలిసి స్కూటీపై చింతపల్లి వైపు వెళ్తున్నారు.

అన్నెబోయినపల్లి గ్రామశివారులోని హరిహర కళాక్షేత్రం సమీపంలోకి రాగానే హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డి వెనుకొండ బాబు, బుర్రి బాబు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వేణుగోపాలరావు తెలిపారు.