నారాయణపేట, వెలుగు: తాళాలు వేసి ఉన్న ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రూ.6,88,500 స్వాధీనం చేసుకున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. సోమవారం ఎస్పీ ఆఫీస్లో మీడియాకు వివరాలు వెల్లడించారు.
గండీడ్ మండలం లింగయ్యపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ బస్ డ్రైవర్ ఏదుల బాబును కోస్గిలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 2022 నుంచి 18 చోరీలకు పాల్పడినట్లు చెప్పారు.
