కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి : పాలమూరు ఎంపీ డీకే అరుణ

కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి : పాలమూరు ఎంపీ డీకే అరుణ

నారాయణపేట, వెలుగు: కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ సూచించారు. సోమవారం నారాయణపేటలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్  కార్యకర్తలకు ఇప్పించుకుంటున్నారని, అర్హులకు ఇండ్లు వచ్చేలా బీజేపీ కార్యకర్తలు, నాయకులు పోరాటం చేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ప్రజలకు వివరించి అన్నివర్గాల్లో విశ్వాసం నింపాలన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్  పాలనతో ప్రజలు విసిగిపోయారని, బీజేపీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పశ్చిమ బెంగాల్ లో మాదిరిగానే తెలంగాణలో రేవంత్ రెడ్డిని కూడా గద్దె దించుతామన్నారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తుందని, సర్​పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అంతకుముందు బోయిన్ పల్లిలో సర్పంచ్  వెంకటేశ్  ఆర్థికసాయంతో కొనుగోలు చేసిన కంప్యూటర్లను ప్రైమరీ స్కూల్​కు అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగ్ పాండు రెడ్డి, పగడాకుల శ్రీనివాస్, లక్ష్మీకాంత్ రెడ్డి, మున్సిపల్  చైర్ పర్సన్  శ్వేత, వైస్  చైర్​పర్సన్  మంజుల, కౌన్సిలర్  సత్య రఘుపాల్  పాల్గొన్నారు.