జగిత్యాల: బాధిత కార్మిక కుటుంబాలకు రూ.5.20 లక్షల బీమా సాయం

 జగిత్యాల: బాధిత కార్మిక కుటుంబాలకు రూ.5.20 లక్షల బీమా సాయం

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా వెల్గటూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలానికి చెందిన చనిపోయిన నలుగురు నిర్మాణ కార్మికుల కుటుంబాలకు కార్మిక సంక్షేమ బీమా కింద రూ.5.20 లక్షల ఆర్థిక సాయం అందింది. కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి విషయం వెళ్లగానే స్పందించి, ఒక్కో కార్మికుడి నామినీ ఖాతాలో రూ.1.30 లక్షల చొప్పున మొత్తం రూ.5.20 లక్షలు జమ చేయించినట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా మంత్రిని కలిసిన ఎండ్లపల్లి మండల మజ్దూర్ సంఘం అధ్యక్షుడు సిగిరి ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్పంచులు సుమలత, కందికట్ల రాజేశం, బెజ్జాల ప్రవీణ్.. కృతజ్ఞతలు తెలిపారు.