హైదరాబాద్ సిటీ, వెలుగు: అతి వేగంగా వెళ్తున్న ఓ కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఏపీలోని కాకినాడ జిల్లాకు చెందిన రాఘవేంద్ర ప్రసాద్.. తన చెల్లెలు ఎంగేజ్‌మెంట్ ఉండటంతో భార్య భవానీ, కుమారుడు కార్తికేయ, బంధువు మనోహర్‌లతో కలిసి కారులో వెళ్లాడు. కార్యక్రమం ముగించుకొని ఆదివారం సాయంత్రం సిటీకి బయలుదేరారు. రాఘవేంద్రప్రసాద్ కారు నడుపుతున్నాడు.
సోమవారం తెల్లవారుజామున ఓఆర్‌ఆర్ పెద్ద గోల్కొండ గ్రామ పరిధిలోని ఎగ్జిట్15 వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడెన్‌బ్రేక్ వేశాడు. దీంతో రాఘవేంద్ర ప్రసాద్కారు వేగాన్ని అదుపు చేయలేక లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముందు కూర్చున్న మనోహర్ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపారు.
