- డ్రగ్స్పై చేసే యుద్ధంలో 2029 చివరి నాటికి విజయం: డీజీపీ సీవీ.ఆనంద్
భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు: డ్రగ్స్, గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకే ఈగల్ ఫోర్స్ఏర్పాటు చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్పై చేస్తున్న యుద్దంలో 2029 చివరి నాటికి విజయం సాధించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయన్నారు.
సింగరేణి సీఎస్ఆర్నిధులతో నిర్మించిన మణుగూరు పోలీస్ స్టేషన్‌తో పాటు కొత్తగూడెంలోని పోలీస్హెడ్క్వార్టర్ లో నిర్మించిన గెస్ట్ హౌస్, డిస్పెన్సరీలను సోమవారం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్అంకిత్, ఎస్పీ బి. రోహిత్‌రాజుతో కలిసి ప్రారంభించారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ బెటాలియన్‌ను సందర్శించి రెస్క్యూ పరికరాలను పరిశీలించారు. కొత్తగూడెంలోని పోలీస్హెడ్క్వార్టర్ లో నిర్వహించిన రివ్యూలో మాట్లాడారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలు గంజాయి రవాణాకు ద్వారాల్లా ఉన్నాయన్నారు.
ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల పోలీస్అధికారులను కో ఆర్డినేషన్ చేసుకుంటూ గంజాయి అక్రమ రవాణాకు చెక్‌పెట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పోలీసులు ప్రజలతో భాగస్వామ్యం అవుతూ గంజాయిని అడ్డుకోవచ్చని చెప్పారు. జిల్లాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో కొందరు వ్యక్తులు గ్యాంగ్ లుగా మారి చోరీలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని గుర్తించి గ్యాంగ్ఫైల్స్ఓపెన్చేయాలని సూచించారు.
సైబర్‌క్రైంపై జిల్లా పోలీసులు మంచి పట్టు సాధించారని, కోర్టుకు సంబంధించి పనులను మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పోలీస్‌సేవలను సమర్థవంతంగా అందించగలుగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రివ్యూలో ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డీఎస్పీలు ఆదినారాయణ, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
