న్యూఢిల్లీ: యూజర్‌నేమ్ ఫీచర్ వివాదంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌కు కేంద్ర ప్రభుత్వం స్పల్ప ఊరట కల్పించింది. ఈ ఫీచర్‌పై నెలకొన్న వివాదంపై వివరణ ఇచ్చేందుకు వాట్సాప్‌కు ఇచ్చిన గడువును మరో మూడు రోజులు పొడగించింది. మొదట జూలై 6లోపు సమాధానం ఇవ్వాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. అయితే, వాట్సాప్ అభ్యర్థన మేరకు గడువును మరో మూడు రోజులు అంటే.. జులై 9 వరకు పెంచింది. మరోవైపు.. ఈ అంశంపై వివాదం ముగిసే వరకు ఇండియాలో యూజర్ నేమ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురామని ప్రభుత్వానికి వాట్సాప్ హామీ ఇచ్చింది.
అసలేంటి ఈ యూజర్‌నేమ్ ఫీచర్ వివాదం..?
ప్రస్తుతం వాట్సాప్‌లో ఇతరులతో చాట్ చేయాలంటే ఫోన్ నెంబర్ తప్పని సరి. ఈ క్రమంలో తన వినియోగదారుల కోసం వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అదే యూజర్‌నేమ్ ఫీచర్. ఈ ఫీచర్‌తో ఫోన్ నెంబర్ లేకుండా కేవలం యూజర్ నేమ్‌తో ఇతరులో చాట్ చేయొచ్చు. అయితే, ఈ ఫీచర్‌పై ఇండియాలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ALSO READ : మైక్రోసాఫ్ట్‌లో మరోసారి లేఆఫ్స్..
యూజర్‌ల ఫోన్ నంబర్లను దాచిపెట్టే ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, నకిలీ గుర్తింపులతో సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే యూజర్ నేమ్ ఫీచర్‌కు సంబంధించిన భద్రతాగోపత్య గురించి వివరణ ఇవ్వాలని వాట్సాప్ కు నోటీసులు జారీ చేసింది. 2026, జులై 6లోగా సమాధానం చెప్పాలని డెడ్ లైన్ విధించింది. అయితే, వాట్సాప్ అభ్యర్థన మేరకు డెడ్ లైన్ ను జులై 9 వరకు పొడగించింది కేంద్ర ప్రభుత్వం.
