అమెరికాలో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక దంపతుల పోస్ట్ వైరల్ గా మారింది. డాక్టర్ ఫీజు 23 వేలు.. మందులకు 42 వేలు.. మొత్తం ఒక్క విజిట్ లో 65 వేల రూపాయలా..? అమెరికా వద్దురా నాయనా.. ఇండియాలోనే బాంగుంది అని చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండియాకు చెందిన సీనియర్ సిటిజన్ అధిర్ సిన్హా.. గత రెండు నెలలుగా అమెరికాలోని సియాటెల్ లో ఉంటున్నారు. భారత్ నుంచి తెచ్చుకున్న మెడిసిన్ అయిపోవడంతో.. హాస్పిటల్ కు వెళ్లిన వాళ్లకు ఎదురైన అనుభవం ఇది. శ్వాస కోస వ్యాధితో బాధపడుతున్న తన భార్యకు చూపేందుకు హాస్పిటల్ కు వెళ్లగా.. ఒకే విజిట్ కు 65 వేలు చెల్లించి రావడం షాకింగ్ కు గురిచేసినట్లు ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.
ఇదొక్కటే కాదు.. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు వెంటనే అందుబాటులో లేవట. నాలుగు లేదా ఐదు రోజుల్లో తెప్పిస్తామని.. అప్పుడు వచ్చి తీసుకోవాలని చెప్పడంతో ఏంచేయాలో తోచని పరిస్థితి అని చెప్పుకొచ్చారు. దీనికి తోడు ఆ మందులు కూడా భారత్ కు చెందిన ఫార్మా కంపెనీ సిప్లా తయారు చేసినవి.. మేడ్ ఇన్ ఇండియా మందులు అని చెప్పాడు. ఇక్కడ పూర్తిస్థాయిలో వైద్యం, మందులు పొందటానికి 12 రోజులు పట్టినట్లు తెలిపారు.
ALSO READ : మరోసారి రీచార్జ్ షాక్..!
అమెరికాలో జీవన విధానంతో పోల్చితే ఇండియాలో బెటర్ అని తన పోస్టో లో పేర్కొన్నారు. భారత్ లో తక్కువ ధరలకే మందులు దొరుకుతాయి.. బొబైల్ డేటా చీఫ్, నిత్యావసర సరుకులు నిమిషాల వ్యవధిలోనే డెలివరీ అవుతాయి.. ఈజీగా స్పెషలిస్ట్ డాక్టర్ ను కలవచ్చు.. ఇంటి వద్దకే వచ్చి చేసే డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ ఉంటుంది.. యూపీఐ ఆధారంగా పేమెంట్ చేసే విధానం.. ఒకే కుటుంబంలా కలగలిసి ఉండే ఇరుగు పొరుగు ప్రజానీకం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియానే చాలా బెటర్ అంటూ పోస్ట్ చేశారు.
ఇండియా అనేది ఒక దేశం కాదు.. అది ఒక అద్భుత ప్రపంచం.. అన్ని అందుబాటులో.. అంతా అనుకూలంగా ప్రతిరోజు గడిచే వాతావరణం అక్కడ ఉంటుందని పేర్కొన్నారు.
ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. చాలా మంది యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్ అమెరికాలో కూడా ఉండదని అంటున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండే వైద్యం.. కాస్ట్ ఆఫ్ లివింగ్ అమెరికాతో పోల్చితే చాలా బెటర్ అంటూ రిప్లై ఇస్తున్నారు.
అమెరికాలో మెడికల్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో ఈ ఘటన ఒక ఉదాహరణ అని కొందరు కామెంట్స్ చేశారు. కన్సల్టేషన్ ఫీజులు, ల్యాబ్ టెస్టులు, మందులు ఇలా విడివిడిగా వేసి తాట తీస్తారని.. అంతా ఖరీదైనదేనని అంటున్నారు.
అమెరికా హెల్త్ కేర్ సిస్టమ్ అడ్వాన్స్ డ్ గా ఉంటుందని.. టెక్నాలజీ, స్పెషలైజ్డ్ కేర్ ఇండియాతో పోల్చితే చాలా బెటర్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఫీజులు కూడా ఎక్కువగా ఉంటాని వాదిస్తున్నారు.
*An advice from a senior citizen currently visiting the US*
— Sr.Sinha (@AdhirSinha) July 5, 2026
Dear friends,
We have been staying in Seattle, Washington, for the past two months. My wife was suffering from a severe respiratory issue when we left India. After using those medicines from India,here in the US, she had…
