బీర్కూర్ జ్యోతిబా స్కూల్లో ఫుడ్ పాయిజన్.. 20 మంది స్టూడెంట్లకు అస్వస్థత

బీర్కూర్ జ్యోతిబా స్కూల్లో ఫుడ్ పాయిజన్.. 20 మంది స్టూడెంట్లకు అస్వస్థత
  • బాన్సువాడ ఏరియా హాస్పిటల్కు తరలింపు

బీర్కూర్, వెలుగు: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే స్కూల్, కాలేజీలో ఆదివారం రాత్రి 20 మంది స్టూడెంట్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి డిన్నర్ లో స్టూడెంట్లకు పూరీ, కర్రీ ఇచ్చారు. తిన్న తర్వాత సుమారు 20 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురి కాగా 12 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. గమనించిన సిబ్బంది స్టూడెంట్లను వెంటనే అంబులెన్స్ ద్వారా బాన్సువాడ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

ప్రస్తుతం స్టూడెంట్లు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కాగా, క్వాలిటీ లేని నూనెను వినియోగించడం, వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడడం వల్లే స్టూడెంట్లు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. స్టూడెంట్ల అస్వస్థత విషయం తెలుసుకున్న బాన్సువాడ ఆర్డీవో రవీందర్​రెడ్డి, కాంగ్రెస్​నాయకులు శశికాంత్, మేకల విఠల్, ఎజాజ్, బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ హాస్పిటల్ కు వెళ్లి స్టూడెంట్లను పరామర్శించారు. స్టూడెంట్ల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రిన్సిపాల్ శివకుమార్‌‌ను హెచ్చరించారు.