కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి సబ్‌స్టేషన్‌ను రైతులు సోమవారం ముట్టడించారు. నాలుగు రోజులుగా వ్యవసాయానికి సరిగా కరెంట్ సప్లై చేయడం లేదని, ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ రైతులు సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.
సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ను రూమ్‌లో ఉంచి తాళం వేశారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్యలను పరిష్కరించేదాకా ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. పాల్వంచ మండల ఏఈ జ్యోతి రైతులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
