Brij Bhushan: మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ కోర్టు నిర్దోషిగా తేల్చిన కొన్ని రోజులకే మాజీ డబ్ల్యూఎఫ్‌ఐ (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తన సొంత జిల్లా గోండాలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అతనికి స్వాగతం పలికేందుకు వందలాది మంది మదర్సా విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా లైన్లో నిలబడి పూల వర్షం కురిపించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. షేర్ ఆయా.. షేర్ ఆయా ఆ చిన్న పిల్లలు నినాదాలు చేస్తుంటే, బాణాసంచా కాలుస్తూ బ్రిజ్ భూషణ్ సపోర్టర్స్ గోండా వీధులను హోరెత్తించారు. ఈ రేంజ్ వెల్కమ్ చూసి ఫిదా అయిన బ్రిజ్ భూషణ్.. మైనారిటీ పిల్లలు చూపించిన ఈ అభిమానం, ప్రేమ తనకు వెలకట్టలేనివంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కోర్టు తీర్పుతో అంతా ముగిసిపోయిందనుకుంటున్న వేళ.. బాధితులైన మహిళా రెజ్లర్లు హైకోర్టు తలుపు తట్టేందుకు రెడీ కావడం ఈ వివాదానికి కొత్త ట్విస్ట్ ఇచ్చింది.
లగ్జరీ SUVలో ఎంట్రీ.. పూల వర్షంతో హోరెత్తిన వీధులు:
కోర్టు తీర్పు తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గానికి వచ్చిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఆయన మద్దతుదారులు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. భారీగా చేరుకున్న మదర్సా విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఆయనపై గులాబీ పూలు చల్లుతూ జిందాబాద్ అంటూ కేకలు పెట్టారు. మెడలో భారీ పూలమాలలతో సత్కరించిన అభిమానులకి అభివాదం చేస్తూ బ్రిజ్ భూషణ్ తన లగ్జరీ ఎస్‌యూవీ (SUV) ఫ్రంట్ సీట్లో కూర్చొని ముందుకు సాగారు. కాన్వాయ్ వెళ్తున్నంత సేపు బాణాసంచా కాలుస్తూ, పోలీసులు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం గమనార్హం.
ఆ పిల్లల ప్రేమ వెలకట్టలేనిది.. బ్రిజ్ భూషణ్ పోస్ట్ వైరల్:
ఈ ఘన స్వాగతానికి సంబంధించిన వీడియోను బ్రిజ్ భూషణ్ స్వయంగా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. గోండా సదర్‌లో మైనారిటీ రంగానికి చెందిన పిల్లలు ఈ రోజు నాకు అందించిన అపూర్వ స్వాగతం నన్ను ఎంతగానో భావోద్వేగానికి గురి చేసింది. మీ అందరి నుంచి లభించిన ఈ ఆప్యాయత, ప్రేమాభిమానాలు నాకు ఎంతో వెలకట్టలేనివి అంటూ రాసుకొచ్చాడు. మొదటి నుంచి తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన బ్రిజ్ భూషణ్, ఈ కోర్టు తీర్పు తన నిజాయితీకి దక్కిన విజయమని ధీమా వ్యక్తం చేశాడు.
ALSO READ : కారులో రూ.9 కోట్ల డబ్బు.. అన్నీ 500 రూపాయల నోట్ల కట్టలే..!
హైకోర్టుకు వెళ్లనున్న మహిళా రెజ్లర్లు:
ఢిల్లీ కోర్టు తీర్పుతో బ్రిజ్ భూషణ్ వర్గం పండగ చేసుకుంటున్నా, ఈ వివాదం మాత్రం ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మహిళా రెజ్లర్లు దీన్ని ఉన్నత న్యాయస్థానంలో (హైకోర్టు) సవాల్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసు సాగిన తీరుపై, విచారణ పరిస్థితులపై వారు ఇంకా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ డ్రామా ఇక్కడితో ఆగదని, హైకోర్టులో లీగల్ పోరాటంలో ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయో అని దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.
आज गोंडा सदर में अल्पसंख्यक समाज के बच्चों द्वारा बड़ी संख्या में किए गए भव्य स्वागत से अभिभूत हूँ।
— BrijBhushan Sharan Singh (@b_bhushansharan) August 21, 2026
आप सभी का यह स्नेह, अपनापन और आशीर्वाद मेरे लिए अनमोल है। pic.twitter.com/l9BSmXWd1L
