నెల్లూరు: పిల్లలు తప్పు చేస్తే పెద్దలు మందలిస్తారు. ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను పిల్లలకు విడమర్చి చెప్పి మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూస్తారు. కానీ.. పెద్దలే తప్పు చేస్తే.. పిల్లలు కూడా అది తప్పు కాదని భావించి ఆ తప్పును వాళ్లు కూడా చేయాలని చూస్తారు. కానీ.. ఈ బుడ్డోడు మాత్రం తండ్రి తప్పు చేస్తే పోలీసులను వెంటబెట్టుకుని మరీ ఇంటికి వెళ్లాడు.
ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగింది. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా కార్డన్ సెర్చ్ చేశారు. ఇందులో భాగంగా.. పోలీసులు ఇంటింటికీ వెళ్లి.. ఇంట్లోని వాహనాలను తనిఖీ చేశారు. ఈ సమయంలో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో సురేష్ అనే అతను బైక్కి సరైన పత్రాలు లేకపోవడంతో తన బైక్ను ఇంటికి దూరంగా మరో వీధిలోకి తీసుకువెళ్లి పెట్టాడు.
అయితే పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం చూస్తున్న సురేష్ కొడుకు ఆరేళ్ళ వయసున్న మహేంద్ర తన తండ్రి పోలీసులను చూసి బైక్ ఇంటికి దూరంగా పెట్టడాన్ని గమనించాడు. కార్డన్ సెర్చ్ చేస్తున్న పోలీసుల దగ్గరకు మహేంద్ర వెళ్లాడు. తన తండ్రి బైక్ దాచిపెట్టాడని చెప్పాడు. పోలీసులను తీసుకెళ్లి తండ్రి ఇంటికి దూరంగా ఉంచిన బైక్ను పోలీసులకు చూపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పిల్లాడి తెగువకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తండ్రి తప్పు చేసినా కప్పి పుచ్చకుండా పోలీసులను తీసుకెళ్లి బైక్ చూపించడంతో పిల్లాడిపై ప్రశంసల జల్లు కురిసింది. అయితే.. పోలీసులు వెళ్లిపోయాక బుడ్డోడి పరిస్థితి ఏంటని నెటిజన్లు సరదాగా సెటైర్లు వేస్తున్నారు.
😂 శత్రువులు ఎక్కడో ఉండరు.. కొడుకుల రూపంలో ఇంట్లోనే తిరుగుతుంటారు!
— Suresh_Journalist (@Suresh_Journo) August 21, 2026
నెల్లూరు జిల్లా అనంతసాగరంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. ఓ తండ్రి తన బైక్ను మరో వీధిలో దాచిపెట్టాడు.
అయితే ఇదంతా గమనించిన ఆరేళ్ల మహేంద్ర.. నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి “మా నాన్న బైక్… pic.twitter.com/gcWfikaENg
