గుజరాత్ లో కల్తీ మద్యం కలకలం రేగింది. మిథనాల్ కలిపిన కల్తీ మద్యం తాగి 8 మంది మృతి చెందగా... 25 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్య నిషేధం అమల్లో ఉన్న గుజరాత్ లో ఈ ఘటన జరగటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు 12 మంది కల్తీ మద్యం వ్యాపారులను అరెస్ట్ చేశారు. 21 మందిపై కేక్స్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
గుజరాత్ లోని భావనగర్ జిల్లాలోని ఒక గ్రామంలో మంగళవారం ( ఆగస్టు 18 ) మద్యం పార్టీ చేసుకున్న ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. అదే సమయంలో భావనగర్ లోని పలు ప్రాంతాల్లో కూడా కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు జనం. ఈ క్రమంలో అలర్టయ్యారు పోలీసులు, జిల్లా అధికారులు. ఈ ఘటనలో మరణించిన, చికిత్స పొందుతున్నవారి నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ లో విషపూరితమైన మిథనాల్ ఆనవాళ్లు కనిపించినట్లు తెలిపారు అధికారులు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ పేరుతో విక్రయించిన కల్తీ మద్యంపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
►ALSO READ | అలస్కాలో ఘోర విమాన ప్రమాదం..చార్టర్ విమానం కూలి 8మంది మృతి
ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ కు చెందిన నరేంద్ర సింగ్ యాదవ్ అలియాస్ డాక్టర్ పర్యవేక్షణలో కల్తీ మద్యం వ్యాపారి గౌతమ్ సోలంకి ఇంట్లో ఈ మద్యం తయారైనట్లు గుర్తించారు పోలీసులు. వీరితో పాటు సరస్, గణేష్, అమన్ లు కూడా కల్తీ మద్యం తయారీలో పాల్గొన్నట్లు గుర్తించారు పోలీసులు. నరేంద్ర సింగ్ యాదవ్ కల్తీ మద్యం సేవించగా... మరుసటిరోజు అతడి ఆరోగ్యం విషమించడంతో కల్తీ మద్యం తయారీ గుట్టు రట్టయ్యింది.
పోలీసులు స్వాధీనం చేసుకున్న కల్తీ మద్యంలో 38.59 శాతం మిథనాల్, 0.94 శాతం ఇథనాల్ ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. దీంతో అది అత్యంత విషపూరితమైన మద్యం అని నిర్దారించారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి 21 మందిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
